సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, జులై 2020, గురువారం

మహామనుస్తవం - పరిచయం


పరిచయం:

మహామనుస్తవం అను ఈ అద్భుత శ్రీవిద్యాసూత్రములు/స్తుతులను శ్రీ టి.వి.కపిలశాస్త్రి గారు రచించారు. దీనిని ఈ మహానుభావుడు తన అరవై ఏట రచించేను. ఇందు ఈయన శ్రీవిద్యయొక్క మహిమస్తోత్రమును ప్రకటించెను. ఈయన తన చిన్నతనముననే తన తండ్రిగారిచేత శ్రీవిద్యలోకి ప్రవేశింపబడెను. ఆతర్వాత ఈయన సిద్ధపురుషులైన శ్రీ భగవాన్ రమణమహర్షి  వారి శిష్యులైన మహాశక్తి ఉపాసకులు శ్రీ ఆయలసోమయాజుల గణపతిముని గారి దగ్గర శిష్యరికం చేసి శక్తి ఉపాసనలో మరింత ఆధ్యాత్మిక పురోగతి సాధించెను. ఆ తర్వాత ఈయన మరొక మహానుభావులైన శ్రీ అరబిందో వారి దగ్గర శిష్యరికం చేసి యోగవిద్యను కూడా అభ్యసించెను.

మహామనుస్తవం ఉత్త శ్రీవిద్యా స్తుతి మాత్రమే కాదు. ఇందు విశేషముగా శ్రీమహాత్రిపురసుందరిని అభివ్యక్తీకరించి ఆమెను చేరు మార్గమును విస్పస్టముగా విశదీకరించెను. ఈ సూత్రాలను సాహిత్యదృష్టితో చూస్తే రహస్యములు తెలుసుకోలేము. ఒక స్థాయి సాధకులు మాత్రమే ఈ సూత్రాలలో దాగున్న అద్భుత శ్రీవిద్యా రహస్యములను అవగతం చేసుకోగలరు.

నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఈ సూత్రాలకు తెలుగులో అర్ధం చెప్పడానికి సాహసిస్తున్నాను. ఈ సూత్రాలకు ఆంగ్ల భాషలో నాకు లభ్యమైన భాష్యమును నేను ప్రామాణికంగ తీసుకొని వాటిని అనువదిస్తున్నాను. ఆంగ్లలో ఉన్న భాష్యమునకు నా సాధనానుభవముతో మరికొన్ని విషయములు జతపరచి ఔత్సాహికులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీమాత, సాధకులు, పండితులు నన్ను సహృదయంతో ఆదరించి ఆశ్వీరదిస్తారని భావిస్తున్నాను మరియు ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులకు నా పాండిత్య లోపమే గాని మరొక కారణం కాదని సవినయంగా విన్నవించుకొంటున్నాను. నా ఊపిరి అయిన పరమేశ్వరికి, పరమపూజ్యులైన నా తల్లిదండ్రులు మరియు నా శ్రీవిద్యా గురువులకు సాష్టాంగప్రణామములు సమర్పిస్తూ ఈ భాష్యమును ప్రారంభిస్తున్నాను.

                                          శ్రీమాత్రేనమః

కామెంట్‌లు లేవు: