సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, జులై 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 9


రెండువేల వర్ణముల మంత్రము, నూరు-నూరు అక్షరముల మంత్రము ఖండస్తోత్రము అవుతుంది. ఈ మంత్రమును యథాస్థితముగా ఇవ్వవలసిఉంటుంది. ఈ ప్రకారముగా విద్యను, కామ్య కర్మములను తెలుసుకోవాలి. ఈ దోషములను తెలుసుకోకుండా ఏ మూర్ఖుడు జపము చేస్తాడో అతడికి నూరుకల్పముల దాకా సిద్ధి కలగదు.

శ్రీవిద్యారణ్యస్వామి చెబుచున్నారు - శ్రీమదారాధ్య ముఖమునుండి ప్రాప్తమైన శ్లోకములకు అర్ధమును ఇక్కడ పొందుపరస్తున్నాను.

మంత్రమునందు ఆది-మధ్యమ-చివర ఉండును. అనిలం (=వాయువు) యకార బీజము. హ్రీం మాయాబీజము. ఇది సంప్రదాయము. మాయాబీజము నుండి ఏర్పడిన నామాలను శివవల్లరీ మాలినీ మంత్రము అని అంటారు.

వాతావర్తిఫల వాణీబీజంను శక్తికుండలీ అంటారు. ఇది శైవాగమమున చెప్పబడినది. వాయుబీజముతోనూ అక్షరాంతరముతోనూ సంయుక్తము, వియుక్తము లేదా రహితము అయితే మాయాబీజము దీర్ఘస్వరాక్రాంతమవుతుంది.

లక్షసాగరమునందు ఈవిధంగా చెప్పబడినది -
"ఆదిమధ్యావ సానేషు యస్యమంత్రస్య దృశ్యతే| చతుర్ధా, పంచాధా, ద్వేధా చైకవీరం స్వరాన్వితం"|
యకారము వాయుబీజము. హ్రః ఏకవీరము. ఇదియే స్వరాక్రాంత్రము. దీర్ఘస్వరాయుక్తం హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః -
దీని ఉదాహరణ మంత్రం : అఘోరేభ్యోధ హ్రాం ఘోరేభ్యో హ్రీం ఘోరఘోరతరేభ్యో హ్రూం సర్వేభ్యోసర్వసర్వేభ్యో హ్రైం నమస్తే అస్తు రుద్రరూపేభ్యో హ్రౌం.

ఆదిమధ్యాంతమునందు భూ బీజము లం అది కూడా స్థానత్రయ, ప్రతిస్థాన లకారద్వయములు చెప్పబడ్డాయి. వాని అంతర్దర్శనము నుండి ఆది, అంతమునందు రెండు, మధ్యన మూడు తెలుస్తాయి.

లక్షసాగరమునందు ఈవిధంగా చెప్పబడినది -
"ద్విధా పూర్వే త్రిధామధ్యే ద్విధాంతేచ పునః ప్రియే| వజ్రీయుక్తస్తు యో మంత్రః సానిరుద్ధ ప్రకీర్తితః||"
వజ్రీ లకారము. పింగలామంతము నుండి "ఆదౌ ద్విధా త్రిధామధ్యే పునశ్చాంతే ద్విధాభవేత్| ఇంద్ర బీజమసౌ మంత్రో రుద్ధ ఇత్యభిధీయతే||"

మాయా భువనేశ్వరీ బీజము. త్రితత్త్వము, హుంకారము, ఫ్రేంరావము ఇవన్నీ ఒకేసారి అపేక్షితములు (=కోరబడినవి) కావు. ఏ మంత్రమునందు ఇవన్నీ ఉండవో ఆ మంత్రము శక్తి హీనమవుతుందని తంత్రాంతరమందు చెప్పబడినది. పింగళామతమునందు కూడా ఈ విషము సమర్ధించబడినది. శక్తిహీనమైన మంత్రము మంత్ర సాధకుల సామర్ధ్యము హరించివేయునని కూడా పింగళామతమునందు చెప్పబడినది.

ఏ మంత్రమునకు మధ్యన కామకలా బీజము, ముందర మాయాబీజము, చివర అంకుశబీజము ఉండవో ఆ మంత్రము పరాఙ్ముఖమవుతుందని లక్షసాగరమున చెప్పబడినది. ఈ మంత్రమును సమస్త కార్యములందును త్యజించాలని పింగళామతమున సమర్ధించడమైనది.

హం,ఐం,సం లు ఆది,మధ్యన,చివరన అపేక్షితములు కావని లక్షసాగరమున చెప్పబడినది. పింగలామతానుసారము, ఆది-మధ్య-చివర హం-సం బీజములు లేకపోతే ఆ మంత్రము వధిర అవుతుంది. అర్క-హ, ఇందు-స, వహ్ని-ర. దేవతల నేత్రములు మంత్రమునకు కూడా నేత్రములవుతాయి. ఏ మంత్రము నందు ఈ బీజాక్షరములుండవో ఆ మంత్రము నేత్రహీన అవుతుంది. అది దుఃఖానికి, శోకానికి, భయానికి కారకమవుతుంది.

హంస-స్వరూప, ప్రాసాదా=హౌం, వాగ్భవ-ఐం, జీవ-స ఈ ప్రకారంగా ఇవన్నీ కలసి సౌహం రూపమవుతుంది.

"అష్టమ స్వరసంయుక్తో జీవరూఢం సబిందుకః|
యాస్యాత్మాదృశయతేనైవ కింవాఏవ చతుష్కలః||  
ప్రాసాదో వాగ్భవో హంస మాయావా యత్ర దృశయతే|
ఆదిమధ్యాంతదేశేషు కీలితం తత్ప్రచక్షతే||"

అర్ధము: ఆత్మ-హం కారము, అష్టమస్వరము-ఓంకారము, హ్రస్వ-దీర్ఘభేదముతో-ఫ్రేం, చతుష్కాలం-హూం, మూర్ధ్ని-అంతము. ఇక్కడ దీనికి ప్రత్యేక అర్ధము లేదు. కానీ మధ్యన ఒక లకారము, అంతమున రెండు లకారములు లేదా మధ్యన ఒక ఫట్ మరియు చివర రెండు-మూడు లకారములు ఉంటే ఆ మంత్రము స్తంభితమవుతుంది. ప్రారంభమున మరియు అంతమున రెండు సౌః లు ఉంటే అది కూడా స్తంభితమవుతుంది. ఏ మంత్రమునందు రెండు, మూడు లేదా ఆరు ఫట్ లు ఉంటాయో ఆ మంత్రము స్తంభిత మంత్రము . ఇది శివుడు స్వయంగా చెప్పాడు.
రేఫము-వహ్ని, యకారము-వాయువు, ప్రారంభము-మూర్ద్ని. 

ఏ మంత్రమునకు ప్రారంభమున ఏడు యం,రం లు ఉంటాయో ఆ మంత్రము మాయాదగ్ధమవుతుందని పింగళామతమునందు చెప్పబడినది. ఇక్కడ చెప్పబడిన సంఖ్య అంతరిత ఫట్ కారముతో సంబంధము కలది.

ముఖమునుండి ప్రారంభమవునప్పుడు హకారము శివుడు, సకారము శక్తి. ఈ దోషములతో కూడుకున్న దానికి మాతృకాహీన అని నామాంతరము.

ఏ మంత్రమునకు ప్రాంభమున హకారము, సకారము, ఒకారము ఉండవో ఆ మంత్రము మాతృకాహీన అయ్యి సిద్ధికి అవరోధమవుతుంది.

తంత్రసారము ప్రకారము ఆది, అంతం మరియు మధ్యన నాలుగు సార్లు హకారము ఉంటే ఆ మంత్రమును మలిన అంటారు. ఏ మంత్రమునకు ఆది, మధ్యన, అంతమున మూడు మ కారములుంటాయో ఆ మంత్రము మలిన అవుతుందని లక్షసాగరమున చెప్పబడినది.

క్రోధ బీజము "హుం" ప్రారంభమున మరియు చివరన, ద కారము చివరన ఉండునో అది మలిన అవుతుంది. అదేవిధముగా, మంత్ర ప్రారంభమున రెండు అస్త్రఫట్ లు  మధ్యన దకారము, హుం కారము మరియు చివర రెండు ఫట్ లు ఉన్నా ఆ మంత్రము మలిన అవుతుంది. ఏ మంత్రమునకు మధ్యన క్రోధ బీజము, దకారము, చివర రెండు ఫట్ లు ఉంటాయో  ఆమంత్రము నిష్కృత అవుతుందని పింగలమతమున చెప్పబడినది. మరొక విధంగా ఏ మంత్రమునకు మధ్యన దకారము మరియు చివరన రెండు ఫట్ లు ఉంటాయో ఆ మాత్రమును నిష్కృత అంటారు. ఇక్కడ ఒక వికల్పార్ధము ఉంది. ప్రారంభమున ఓం కారము, చివరన వషట్, మధ్యన ఫట్ - వీటిని కూడా గ్రహించాలి. మధ్యన అస్త్రద్వాయి, చివర వషట్, ముందు అ,, మ ఉంటే ఆ మంత్రము భేదిత అవుతుంది. ఇక్కడ, అస్త్ర హ్రః,,, మ ఓంకారము మరియు త్రివర్ణము నుండి హంసను గ్రహించాలని పింగళామతమున చెప్పబడినది. భైరవీత్రంత్రమునందు, ఏ త్ర్యక్షర మంత్రము నందు హంస ఉండదో అది సుషుప్త అవుతుంది. అది సర్వసిద్ధినాశకము. ఏడు, అధిక దశాక్షర దేనికి ఉంటుందో అది అర్ధాద్ పద్దెనిమిది అక్షరముల మంత్రమవుతుంది. ఏ విద్య లేదా మంత్రము పద్దెనిమిది అక్షరములు ఉండి ప్రారంభమున అయిదు ఫట్ కారములుంటాయో ఆ మంత్రమును మదోన్మత్త అంటారని లక్షసాగరమున చెప్పబడినది. పింగలామతమునందు ఏ విద్యా లేదా మంత్రరాజమునందు పదిహేడు కన్నా ఎక్కువ అక్షరములు ఉంది ప్రారంభమున అయిదు ఫట్ కారములు ఉంటే అది ఉన్మత్త అవుతుందని చెప్పబడినది. ఏ మంత్రమునకు మధ్య మరియు చివర ఫట్ కారము ఉంటుందో అది హీనవీర్య అవుతుందని పింగళామతమునందు చెప్పబడినది. ఆ మంత్రము సిద్ధిదాయకము కాదు. తంత్రామ్తరమునందు, ఆ మంత్రము భీతిని కలిగించునని చెప్పబడినది. పంతొమ్మిది అక్షరముల మంత్రము ప్రణవాన్వితము మరియు హ్రీం, క్రోంలతో యుక్తము అవుతుందో ఆ మంత్రము ప్రధ్వస్త అవుతుందని భైరవీ తంత్రములో చెప్పబడినది. పింగళామతము నందు కూడా ఇదే విషయాన్ని శివుడు చెప్పినట్టుగా చెప్పబడినది. సప్తాక్షర మంత్రము బాల అవుతుందని భైరవీతంత్రము నందు చెప్పబడినది. అష్టాక్షర మంత్రము కుమార, నలభై అక్షరముల మంత్రము ప్రౌఢ మరియు షోడశాక్షర మంత్రము తరుణి అవుతాయి. ముఫై అక్షరములు, అరవైనాలుగు అక్షరములు, వంద అక్షరములు, నాలుగు వందల అక్షరముల మంత్రములు ప్రౌఢ అవుతాయని భైరవీ తంత్రము నందు చెప్పబడెను.

నవాక్షర ఓంకార మంత్రము నిస్త్రింశ అవుతుంది. భైరవీతంత్ర అనుసారము ఆ మంత్రము మృత్యుదాయకము. దేనియందైతే హృదయం నమః, శిరోమంత్ర స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హుం, వీటితో బాటు వౌషట్, ఫట్ కారము లేదా హకారము, శక్త్యర్ణ సకారము మధ్యన ఉండవో ఆ మంత్రము నిర్జీవ మవుతుంది. భైరవీతంత్రము నందు కూడా ఈ విషయం చెప్పబడినది. ఆ మంత్రము అన్నికర్మలందు గర్హితము. ఇక్కడ దోషమును బహువచన ప్రయోగములో చెప్పబడెను. కానీ తంత్రాతరము నందు నిర్జీవ లక్షణము యొక్క దోషము ఒక్క అక్షరముతోనే ప్రతిపాదించెను. అయినా సరే గ్రంథకర్త బహువచన ప్రయోగమే చేసెను.
లక్షసాగరమున ఈ విధంగా చెప్పబడినది - నిర్బీజమందు ఓంకారము వర్జితము. ఆవిధంగా ఆది-మధ్యమ-అంతమునందు కూడా అవుతుంది. ఇక్కడ కూడా స్థానత్రయములను కలిపితే ఆరు ఫట్ కారములు అవుతాయి.

దశాక్షర మంత్రము మంద అవుతుంది. ఎక్కువ అక్షరముల మిశ్రమం చేత కూటమవుతుంది. ఆ ఎక్కువ అక్షరములు ఏకాక్షరముగా అవుతే దానిని నిరంశక అంటారు. రెండు వర్ణముల మంత్రము శక్తి హీనంవుతుంది. నాలుగు వర్ణముల మంత్రము కేకర. పింగలమతమునందు "ధ్రువహీనశ్చతుర్బీజైః షడ్భిర్వాకేకరో మతః" అని చెప్పబడినది. ఓంకార రహిత షడక్షర మంత్రము బీజహీనమవుతుంది. ఏడున్నర, పన్నెండున్నర మరియు మూడున్నర అక్షరముల మంత్రము ధూమిత అవుతుందని లక్షసాగరమున చెప్పబడినది.

త్రింశదేకోణము అనగా ఇరవైతొమ్మిది. ఇరవైతొమ్మిది వర్ణముల మంత్రము అంగహీనమవుతుంది. భైరవీతంత్రము మరియు లక్షసాగరమునందు ముఫైఎనిమిది వర్ణముల మంత్రము అంగహీనమవుతుందందని చెప్పబడినది. పద్దెనిమిది వర్ణముల మంత్రము కూడా అంగహీనమవుతుంది. నలభైనుండి అరవై మూడు అక్షరములు, ఒకొక్క అక్షరము వృద్ధి చెందుతూ ఇరవై నాలుగు రకముల మంత్రము అయితే దానిని సవ్రీడ అంటారు. వంద, రెండువందలు, ద్వినవతి (తొంభైరెండు) ఒకే మంత్రము యొక్క మంత్ర భేదములు. ఏడు వర్ణములు, ఏడున్నరవర్ణములు, తొంభైరెండు వర్ణములు, తొంభైఒకటి కన్నా అధిక శతద్వయ వర్ణములు, శతత్రయ వర్ణములు - ఈ అయిదు ప్రకారముల మంత్రమునకు నిఃస్నేహ దోషము కలుగుతుంది. ఇక్కడ కొంతమంది, శతద్వయము ఒకప్రకారంగా, ద్వినవతి ఇంకొక ప్రకారంగా మరియు ఏకనవతి మరొకప్రకారంగా ఒప్పుకుంటున్నారు. కానీ అది అసంగతము. అరవైయారు అక్షరములనుండి తొంభై తొమ్మిది అక్షరముల వరకు ఉన్న మంత్రమును స్థానభ్రష్ట అంటారు. ఇందువలననే వందకన్న ఎక్కువ అక్షరములు గల మంత్రమును నిఃస్నేహ అంటారు. వెయ్యి వర్ణముల మంత్రము దండకమవుతుంది. ఇదే స్తోత్రరూపంలో ఉంటే పిండిత అంటారు. ఈ మంత్రము, విద్య, దోషయుక్తములవుతాయి.

భైరవీతంత్రమునందు ఈ విధంగా చెప్పబడినది.
       యథామంత్రాస్తథావిద్యా భేదభిన్నాస్తతః పరమ్|
       జ్ఞాతవ్యా దేశికేన్ద్త్రైస్తు నానాతంత్రేషు భాషితా||

ఈ మంత్రదోషములు కామ్యకర్మములందు బాధకములవుతాయి. నిష్కామ కర్మములందు జపములందు ఈ దోషములు బాధించవు.

ఇంకాఉంది.

1 కామెంట్‌:

Rajusailpoint చెప్పారు...

శ్రీ మాత్రే నమః

ఇన్ని వివరములు మాకు తెలియజేస్తున్నందుకు గురువు గారికి పాదాభివందనములూ

సర్వం శ్రీ లలిత చరణారవింద సమర్పణమస్తు :