సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, నవంబర్ 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 42-43

 

నిత్యక్లిన్నానిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము:

హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా

పదకొండు అక్షరముల ఈ విద్య మహా ఉగ్రము. ఈ మంత్ర ఋషి – బ్రహ్మ| ఛందస్సు – విరాట్| దేవత – వనితాద్రావిణీ పరా నిత్యక్లిన్నా| హ్రీం – బీజం| స్వాహా – శక్తిః| క్లీం – కీలకం| ఒకటి, రెండు, రెండు, రెండు, రెండు, రెండు మంత్రములతో షడంగన్యాసము చెయ్యాలి.

ధ్యానం:

రక్తాం రక్తాంగవసనాం చంద్రచూడాం త్రిలోచనాం|

స్విద్యద్వక్త్రాం మదఘూర్ణలోచనాం రత్నభూషితాం||

పాశాంకుశౌ కపాలం చ మహాభీతిహరం తథా|

దధతీం సంస్మరేన్నిత్యం పద్మాసనవిరాజితాం||

      మంత్రములో ఎన్ని వర్ణములు ఉన్నాయో అన్ని లక్షలు జపము చెయ్యాలి. జపములో దశాంసము మధుమిశ్రిత తిలలతో హోమం చెయ్యాలి. అప్పుడు సాధకుడు పురశ్చరణ కర్త అవుతాడు. ఇప్పపూలతోనూ, పాయసంతోనూ, కమలములతోనూ కూడా హోమము చెయ్యవచ్చు.

యంత్రము: త్రికోణము, అష్టదళము, భూపురము.

ముందుగా దేవిని పూజించి ఆ తర్వాత ఆవరణదేవతలను పూజించాలి. త్రికోణములో మదద్రవా నిత్యక్లిన్నా దేవిని పూజించి, దళముల మూలములలో అష్టమాతృకలను పూజించాలి. దళమధ్యలో 1.నిత్యా 2. నిరంజనా 3. క్లిన్నా 4. క్లేదినీ 5. మదనాతురా 6. మదద్రవా 7. ద్రావిణీ 8. క్షోభిణీలను పూజించాలి. భూపురములో లోకపాలకులను పూజించి మళ్ళీ త్రికోణములో దేవిని పూజించాలి.

హే దేవేశీ! ఈ ప్రకారంగా భోగమోక్షప్రదాయిని త్రైలోక్యవశకారిణీ విద్యను నీకు చెప్పబడినది.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన నిత్యక్లిన్నానిత్యావిధివివరణం అను నలభైరెండవ భాగము సమాప్తము.

 

నలభైమూడవ భాగము

భేరుండానిత్యాయజనవిధివివరణం

మంత్రస్వరూపము:

వం క్రోం చ్రోం ఛ్రోం జ్రోం ఝ్రోం క్రోం ఓం స్వాహా

హే దేవేశీ! పది అక్షరముల ఈ మంత్రము మహావిషమును నిర్మూలిస్తుంది. ఈ మహావిద్య యొక్క ఋషి – మహావిష్ణు| ఛందస్సు – గాయత్రి| దేవత – పరాశక్తి| లం – బీజం| స్వాహా – శక్తిః| క్రోం కీలకం| భా, భీ, భూ, భౌ, భం, భః – షడంగన్యాసం|

ధ్యానం

చంద్రకోటిప్రతీకాశం శ్రవంతీమమృతద్రవైః|

నీలకంఠీం త్రినేత్రాం చ నానాభరణభూషితాం||

ఇంద్రనీలస్ఫురత్కాన్తిశిఖివాహనశోభితాం|

పాశాంకుశౌ కపాలం చ ఛురికాంవరదాభయౌ||

బిభ్రతీం హేమసంబద్ధగరుడోంగారభూషితాం||

పైవిధంగా ధ్యానం చేసిన తర్వాత మంత్రములో ఎన్ని అక్షరములు ఉంటే అన్ని లక్షలు జపము చెయ్యాలి. జపంలో దశాంశము శ్వేత కమలములతో హోమము చెయ్యాలి.

యంత్రము: త్రికోణము, అష్టదళము, భూపురము

త్రికోణ మధ్యన ప్రణవము, దానికి రెండు పార్శ్వములందు సృణి (క్రోం) ను లిఖించాలి. త్రికోణ కోణములలో ఙ,, ణం లను లిఖించాలి. నం, పం లను త్రికోణ అగ్ర భాగము మరియు అంచులో లిఖించాలి. అష్టపత్రములో మాత్రా మంత్రములను క్రమంగా లిఖించాలి. ఆ తర్వాత ఈ క్రింది 64 అక్షరముల మహావిషహరణ భేరుండా మంత్రమును లిఖించాలి.

“హ్రీం త్రిభువనవిద్యే నమః సిద్ధజితే సర్వలోక-ప్రపూజితే భ్రమ భ్రమ మహామోహే హూం హూం విచ్చే కులే కౌలే కుసుమాలే భేరుండే శిఖివాహిని నీలకంఠే రౌద్రే బేతాళి సోమమాతృకే హ్రీం”

ఈ మంత్ర ఋషి – బ్రహ్మ| ఛందస్సు – అనుష్టుప్| హ్రీం – బీజం| దేవత – పురుషార్థప్రదాయిని భేరుండా|

హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – షడంగన్యాసం చెయ్యాలి.

భూపురములో మాతృకా వర్ణములను క్రమంగా లిఖించాలి. వాటిలోకి మహేశానిని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి.

త్రికోణములో శిఖిని, నీలకంఠి, రౌద్రిలను పూజించాలి. త్రికోణ రెండు పార్శ్వములందు బేతాళి మరియు సోమమాతృకను పూజించాలి. అష్టాదళములో ఈ క్రింది దేవతలను పూజించాలి.

భువనేశ్వరి, సిద్ధ, అపరాజిత, లోకపూజ్య, మహామోహ, కులా, కౌల, కుసుమా. వీరిని పూజించిన తర్వాత అక్కడే అష్టమాతృకలను కూడా పూజించాలి. భూపురములో ఇంద్రాదులను పూజించి, మళ్ళీ భేరుండాను పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భేరుండానిత్యాయజనవిధివివరణం అను నలభైమూడవ భాగము సమాప్తము.


కామెంట్‌లు లేవు: