వైశాఖశుద్ధ
తృతీయ నాడు శ్రీమాతంగి ఉద్భవించిన రోజు సందర్భంగా ఈ దేవతను మనం స్మరించుకుందాము.
శ్రీమాతంగి దశమహావిద్యలలో ఒక దేవత. ఈమెకు శ్యామలా అని మరియొక పేరు.
మతంగ ఋషి దర్శించిన దేవత కనుక ఈమెకు మాతంగి అని పేరు వచ్చి ఉండవచ్చు. కొన్ని మతముల
ప్రకారము సరస్వతి ఉగ్రరూపమే మాతంగిగా తెలుస్తున్నది. మాతంగి సాధన వామ, కౌళాచారములలో
చాలా ప్రసిద్ధి చెందినది. ప్రాణతోసిని తంత్రము ప్రకారము పార్వతీదేవి శివునితో ఒకచండాల
స్త్రీరూపంలో సంగమిస్తుంది. ఆ రూపము దశమహావిద్యలలో ప్రఖ్యాతరూపముగా పరిణమించిందని చెబుతారు.
మాతంగి సాధనలో ఉచ్చిష్ఠ చండాలి, రాజశ్యామల, హసంతీశ్యామల, రక్తశ్యామల, శారికాశ్యామల,
వీణాశ్యామల, వేణుశ్యామల, లఘుశ్యామల అను విద్యలు కలవు.
రాజకీయంగా
విజయం సాధించుటకు, కవిత్వసాధనకు, సంగీతవిద్యలో నిష్ణాతులగుటకు ఈ మంత్ర సాధనలు ఉపయోగపడతాయి.
(ఈ
సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన వైశాఖశుద్ధ తృతీయం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి