సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 6

కాది మతము యొక్క గురు క్రమము

కులవిద్యావతారము, గురుసంతతి, గురుపంక్తిత్రయము వీటిని తెలుసుకొని సాధకుడు విద్యాసిద్ధి కొరకు సాధన చెయ్యాలి.
దివ్యౌఘః - సర్వజ్ఞ, ఈశాన, భూతేశ
సిద్దౌఘః - దివ్య, సర్వ, భవ్య
మానవౌఘః - ప్రశస్త, ప్రకామ, సుధామ
వీరందరూ చతుర్భుజులు, త్రినేత్రులు మరియు ఎర్రని మాలలు, వస్త్రములు ధరించి ఉంటారు. వీరి చేతులందు అక్షమాలా, పుస్తకము, వర మరియు అభయ ముద్రలను కలిగి ఉంటారు.

విద్యావతార గురుక్రమము
దివ్యౌఘః - ప్రకాశ, విమర్శ, ఆనంద
సిద్దౌఘః - జ్ఞాన, సత్య, పూర్ణ
మానవౌఘః - స్వభావ, ప్రతిభ, సుభగ

దీక్షా గురుక్రమము
దివ్యౌఘః - ఉద్యోత, ప్రభావ, కులేశ
సిద్దౌఘః - భైరవ, గణప, కుమార
మానవౌఘః - ఉద్భట, వాగ్భవ, కమన
వీరి పూజ వరసలో చెయ్యాలి. వీరి పూజా మంత్రము ఈ క్రింది విధంగా ఉండును.
ఉదా: హ్రీం శ్రీం ఉద్యోతానందనాథ శ్రీ పాదుకాం పూజయామి|
తర్పణము నందు తర్పయామి, మార్జనము నందు మార్జయామి అని చెప్పవలెను.
పూజాంగ హోమము నందు అగ్ని సుందరీ పూజయామి, తర్పణము నందు అగ్నివల్లభా తర్పయామి, మార్జనమునందు అగ్నిదయితా మార్జయామి అని చెప్పవలెను.

ఎనభైనల్గురు గురువుల స్మరణము
ముందు చెప్పబడిన కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువుల తర్వాత క్రమముగా -
అవ్యయ, విశేష, సంగ్రహ, దేవల, ప్రకాండ, గహన, దుర్లభ, దుర్జయ, విశ్వేశ, ఉదయ, త్వరిత, సుందర, భరత, ధిషణ, శ్రీకంఠ, శంకర, అనల, వాసవ, సునేత్ర, సుభగ, వీరేశ, విరహ, క్లిన్నేశ, విజయ, కర్షక, ప్రగల్భ, వినయ, వరద, శాంతన, చిత్రక, అద్భుత, నిపుణ, విపుల, విమల, సోమేశ, కుశల, సుమంత్ర, సుతంత్ర, విద్యేశ, వినత, విభవ, వర్ధన, అనింద్య, సుప్రియ, సారంగ, వారుణ, సత్యేక్షు, అరిహా, వాగ్యత, కామన, వాంగ్మయ, సుకృత, విశాఖ, మంజుల, కామేశ, వాగ్భవ (56)
ముందు చెప్పబడిన గౌడ నుండి శంకరుల వరకు ఏడుగురు. మొత్తం ఎనభై నాలుగు గురువులు. వీరి స్మరణ మాత్రముననే మనుష్యులు శివతుల్యులు అగుదురు. కాదిశక్తి మతము నందు సర్వత్రా ఈ గురువుల స్మరణము చేయబడుతూ ఉంటుంది.
కాళీమత మంత్ర భేదము నుండి అనేక గురుభేదములు.
కాళీమత మంత్ర భేదమును అనుసరించి అనేక గురుభేదములు ఉన్నాయి. పూర్వ, దక్షిణ, పశ్చిమ, మధ్య సింహాసన స్థిత బాలా, భైరవి మొదలగు ముఫైరెండు భేదములున్నాయి. నిత్యాషోడశీ వ్యత్యాసమును అనుసరించి షట్దర్శన, పంచపంచిక, నాలుగు సమయ విద్యలు, నవావరణ దేవతలు, మంత్ర పారాయణ ప్రోక్త విద్యలు, శ్రీచక్ర శక్తుల భజన ప్రతిపాదిత క్రమములో చెయ్యాలి.
విద్యావతార గురువులు

కులగురువులు: ఇంతకు ముందు చెప్పబడిన ప్రహ్లాదానందనాథాది తొమ్మిది మంది.
దివ్యౌఘః - సమయ, కుక్కుట, ప్రధాన
సిద్దౌఘః - బుధేశ, కుధర, భార్గవ
మానవౌఘః - కందల, తపన, ఆప్యదీన

దీక్షాగురు క్రమము
దివ్యౌఘః - పరప్రకాశ, పరమేశాన, పరశివ, కామేశ్వర, మోక్ష, కామ, అమృత
సిద్దౌఘః - ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత
మానవౌఘః - పరమ, సర్వజ్ఞ, సర్వ, సిద్ధ, గోవింద, శంకరాచార్య
దీక్షనందు ఈ గురువులందరినీ పూజించాలి. మానవ గురువుల పూజాంతరము ఈ క్రింది గురువుల పూజ కూడా జరుగుతుంది.
ముందు చెప్పబడిన కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువుల తర్వాత క్రమముగా -
గణేశ, కుమార, విక్రమ, విజయ, రంతిదేవ, సుదేవ, భోజ, రామ, గుణ, భైరవ, భ్రమణ, రమణ, విమల, వైనతేవ, వాసవ, అనల, సంకర్షణ, వీరభద్ర, విశాల, విద్యాధర, విశారద, వైశ్వానర, యజ్ఞేశ, మహీధర, కులాంతక, అనంత, వరద, కామ, జాలంధర, శైవ, సదాశివ, భద్ర, రుద్ర, కందర్ప, సువ్రత, సత్యవ్రత, సత్యనిధి, బోధ, మౌద్గల్య, ఈశాన, గౌడపాద, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.
ఈ గురువులందరూ పూజ్యనీయులు. ఈ గురు క్రమమును తెలుసుకొని భక్తి భావముతో పూజ చెయ్యాలి. పూర్వమ్నాయ దేవతలకు కూడా ఇక్కడ గురుక్రమము కలదు.

దివ్యౌఘః - తారక, రురు, భద్రక
సిద్దౌఘః - అమర, సత్యగ, భాస్వర
మానవౌఘః - అమృత, బోధ, పూర్ణ

విద్యావతార గురుక్రమము
దివ్యౌఘః - ప్రదీప, ప్రభాస, ప్రగల్భ
సిద్దౌఘః - ప్రభావ, వినయ, కుముద
మానవౌఘః - చిదాభాస, చిద్రూప, ప్రకాశ

దీక్షా గురుక్రమం
దివ్యౌఘః - ప్రభావ, ఆదినాథ, విమల, సమయ, శివ
సిద్దౌఘః - నిర్వాణ, గణప, హర, పరశంభు, చిదంశ
మానవౌఘః - కురునాథ, విశుద్ధి, కుశల, కుంతశేఖర, సుడింభ, సుందర, కేశ
ఈ దీక్షా గురువుల పూజ అమ్మవారి వెనకాల జరుగుతుంది.

దక్షిణామ్నాయ ప్రకారముగా ఉపాసన చేసేవారు సిద్ధి కొరకు ఆ ఆమ్నాయ దేవత, మంత్రము మరియు గురుక్రమము తెలుసుకొనుట ఆవశ్యము
ఇంకా ఉంది

కామెంట్‌లు లేవు: