సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మార్చి 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 7


దక్షిణామ్నాయ గురుక్రమము

దక్షిణామ్నాయ గురువుల పూజ విశేష సిద్ధి కొరకు తొమ్మిది వరుసలలో చెయ్యాలి.
ఇంతకు ముందు చెప్పిన విధంగా కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. ఆ తర్వాత వరుసగా -
వీరభద్ర, మహాసేన, గిరీశ, గుణవర్ధన, వాంగ్మయ, వరద, వీర, సుభవ్య, నందీనాయక, విజయ, విశ్వ, వినత, వీరేశ, గిరినందన, ప్రమద, వ్యయయోగ, నిత్యానంద, గుణాతిగ, గుణానంద, గుణారామ, నిరీహ, నిర్మల, విభు, సుభగ, నిర్వికల్ప, మహాకార, అచల, అరుణ, తూణీశ, త్వరిత, ధర్మ, నిరాకార, నిరీన్ద్రియ, హంసేశ్వర, రుచిగ్రీవ, ద్రోణ, విశ్వంభర, బాల, సుదక్షిణ, విరూపాక్ష, గురుభక్త, గురుప్రియ, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.
వీరందరిదీ మానవౌఘ పూజ. విద్యాసిద్ధి కలగడానికి ఈ గురువుల పూజ చెయ్యాలి.

పశ్చిమామ్నాయ దేవతల గురుక్రమము

కులగురువులు: భైరవ, భైరవీ, మహాదేవ, గణేశ్వర, విరూపాక్ష, మహాసేన, వీరభద్ర, కుబేర, బోధ నుండి ఆనంద వరకు (=?).
విద్యావతార గురుక్రమము
దివ్యౌఘః - అఘోర, ఘోర, ఘోరతర
సిద్దౌఘః - శర్వ, సర్వ, రుద్ర
మానవౌఘః - హాంకార, హీంకార, హుంకార
ఈ గురువులు సిద్ధిదాయకులు.

దీక్షా గురుక్రమం

దివ్యౌఘః - ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత
సిద్దౌఘః - సమారస, భూతేశ, లలిత, స్వస్థ, కౌలేశ
మానవౌఘః - ఆలస్య, ప్రభానంద, రాగిణీ, వక్రరాగిణీ, అతీత, కుబ్జ, కులకౌలేశ్వర
దేవీ పృష్ఠభాగమందు తొమ్మిది వరసలలో వీరి పూజ జరుగుతుంది.
కులకౌలేశ్వర తర్వాత స్వగురు క్రమ పూజ జరుగుతుంది. 

స్వగురు క్రమము

కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు తర్వాత క్రమముగా -
అనంత, శంకర, పింగళ, కరాలక, సిద్ధ, రత్న, శివ, మేహీ, సమయ, ఖగేశ్వర, భద్ర, కూర్మ, ఘోర, గోప, మీన, కౌలిక, తీవ్ర, డామర, రామ, కామ, శాకినీ, మహామాయ, మహానంద, ఆధారేశ, చక్రక, కురుర, సమయ, శ్రీశ, కుబ్జిక, కులదీపికా, శివేశ, శర్వరీ, ధర్మీ, కామీ, కామకలా, శివ, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.
వీరి తర్వాత స్వగురు సంతతిని తెలుసుకొని భక్తి పూర్వకంగా వారికి పూజ చెయ్యాలి.

ఉత్తరామ్నాయ దేవతల గురుక్రమము

విద్యాసిద్ధి కొరకు విశేష ప్రయత్నము మరియు శ్రధా భక్తులు కలిగి గురుక్రమ జ్ఞానముతో ఉత్తరామ్నాయ దేవతలకు పూజ చెయ్యాలి.

కులగురువులు: ముందు చెప్పబడిన ప్రహ్లాదానందనాధాది తొమ్మిది మంది

విద్యావతార గురుక్రమము

దివ్యౌఘః - ఉడ్డీశ, కులేశ, పూర్ణేశ
సిద్దౌఘః - కామేశ్వర, శ్రీకంఠ, శంకర
మానవౌఘః - అనంత, పింగళ, నాద
ఈ గురుపూజ సిద్ధిదాయకం.

దీక్షా గురుక్రమం

దివ్యౌఘః - మహాదేవి, మహాదేవ, త్రిపుర, భైరవ
సిద్దౌఘః - బ్రహ్మానంద, పూర్ణదేవ, చలచిత్త, చలాచల్, కుమార, క్రోధన, వరద, స్మరదీపన, మాయా, మాయావతీ
మానవౌఘః - విమల, కుశల, భీమసేన, సుధాకర, మీన, గోరఖ, భోజదేవ, ప్రజాపతి, మూలదేవ, రతీదేవ, విఘ్నేశ్వర, హుతాశన, సమయానంద, సంతోష
దేవీ పృష్ఠభాగమందు తొమ్మిది వరసలలో వీరి పూజ జరుగుతుంది.
సంతోషానంద తర్వాత గురుసంతతి పూజ చెయ్యాలి. వారు,
శంబర, హృదయ, భోగ, నాభస, కౌలిక, ధర, అభయ, శంబర, భద్ర, మహాఘోర, మనోమయ, భైరవ, శవర, కాల, మత, బ్రహ్మ, మహాకుల, వాహన, ఖేచర, వ్యోమ, శ్వసన, జ్వలన, అజ, ఈశ, తాత, కులాతీత, వాయు, సంహార, కౌటిల, విరోధ, పరమ, గోప్తా, షట్చక్ర, పరమ, పర, ముక్త, జ్ఞాన, కుల, సత్య, వర్జార, మంత్రవిగ్రహ, స్వచ్ఛంద, భైరవ, భీమ, వర్ణాడ్య, శబ్ద, శబ్దజ, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య
వీరందరూ సిధ్ధిదాయకులు. వీరి స్మరణ మాత్రముననే మనుష్యులు శివునితో సమానులౌతారు. ఇందు సంశయము లేదు. శంకరాది గురువులను తెలుసుకొని భక్తి భావముతో వీరి పూజ చెయ్యాలి. వీరి పూజ పంచాయతన పూజనందు గాని ప్రత్యేకముగా గాని చెయ్యవచ్చును.గురువంశ జ్ఞాన ఆవశ్యకము:
    
గణేషాది మంత్రముల గురుక్రమము తెలుసుకొనుట ఎంతో ముఖ్యము. గురుకులము తెలుసుకొనకపోతే విద్యామార్గము నష్టమౌతుంది. నష్టమార్గము నందు విద్యాఫలము ప్రాప్తము కాదు. గురువుకు శిష్యులు లేకపోతే సంతతీ క్రమము ఉండదు. అదీక్షితులు చేసే మంత్ర, విద్య సాధనలు నిష్ఫలములు. ఇందు ఎటువంటి సందేహము లేదు. స్వగురువుకు ముందు ఇరవై గురువులు లేదా తొమ్మిది గురువులు లేదా ఏడుగురు గురువులు లేదా ముగ్గురు గురువుల జ్ఞానము ఎవరికైతే ఉండదో వారి శిష్య సంతతి నష్టము చెందుతుంది. సాధకుని వంశజ్ఞానము, గురువంశజ్ఞానము మహా శుభప్రదాయము. తండ్రిని మించి అధిక మంత్రదాత మహేశ్వరుడు. ఇందువలననే గురుక్రమము తెలుసుకొని వారికి పూజ చెయ్యాలి. అందరికన్నా ముందు మంత్రదాత యొక్క పరమగురువును తెలుసుకోవాలి. పరాపర గురు - శక్తి, పరమేష్ఠి గురు - శివుడు. అన్ని మంత్రములు మరియు విద్యలందు స్వయంగా ప్రకృతి రూపిణి దేవి ఉంటుంది. ఆ తర్వాత పురుష రూపంలో గురుసంతతి ఉంటుంది. వీరిలో విశేష శివభక్తి, శివాంశము ఉంటాయి. అన్ని మంత్రములందు సర్వజ్ఞగురు సిద్ధిదాయకులు అవుతారు. శివ-శైవి విద్యలు సమస్త దేశములందు సిద్ధిదాయకములు.

ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: