సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, మార్చి 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 8


గణపతి మంత్రముల గురుక్రమము

గాణపత్యంలో గణదీక్షా ప్రభు గణేశుడు. వైష్ణవము నందు స్వయంగా విష్ణువు, సౌరమందు సూర్యుడు ప్రభువులు. వీరి తర్వాత దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ గురువులుంటారు.

కులగురువులు: గణేశ్వర, గణక్రీడ, వికట, విఘ్ననాయక, దుర్ముఖ, సుముఖ, బుద్ధ, విఘ్నరాజ, గణాధిప.
ఈ కులగురువుల తేజస్సు స్మరించుకోవాలి.

విద్యావతార గురువులు: సురానంద, ప్రమోద, హేరంబ, మహాత్కట, శంకర, లంబకర్ణ, మేఘనాద, మహాబల, గణంజయ

దీక్షా గురుక్రమం

దివ్యౌఘః - వినాయక, విరూపాక్ష, బుద్ధ, శూర, వరప్రద
సిద్దౌఘః - విజయ, దుర్జయ, జయ, కవీశ్వర, బ్రహ్మణ్య, నిధీశ
మానవౌఘః - గజాధిప, దుఃఖారి, సద్యోజాత, ముఖావహ, పరమాత్మ, సర్వభూతాత్మ, మహానాద, శుభావన, బాలచంద్ర.

గురుసంతతి పూజా క్రమము - స్వగురు క్రమము

దీక్షాగురువుల పూజ సిద్ధిదాయకము. పైన చెప్పబడిన బాలచంద్రుని తర్వాత గురుసంతతి పూజ చేయవలెను.
కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క మంది గురువులు. ఆతర్వాత వరుసగా,
గణక, సుభగ, నిత్య, నిత్యాలంబ, శాశ్వత, పూర్ణానంద, పరానంద, సుభక్త, పద్మలోచన, కామపాల, బుధ, శ్రేష్ఠ, గజవక్త్ర, గణప్రియ, భూతేశ, బాలలీల, కుమార, బోధన, హర, సత్యశీల, వికట, ధూమ్రవర్ణ, నందిప్రియ, నందిహాస, దేవీపుత్ర, ధనేశ్వర, విశ్వంభర, విశాలాక్ష, విఘ్నహర్త, వినాయక, కూశ్మాండేశ, కపర్ది, శివ, కాల, మహీధర, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య

ఈ గురువులను నిత్యమూ పూజించడం వలన, స్మరించడం వలన అభీష్టములను ఇస్తారు.

వీరి మంత్రము: శ్రీం హ్రీం క్లీం కపిలసిద్ధాచార్య నమః| ఇలా ఉంటుంది.

వైష్ణవ మంత్రముల గురుక్రమము

కులగురువులు: ప్రహ్లాద, వశిష్ఠ, పుండరీక, పరాశర, శుక, శౌనక, నారద, దాల్భ్య, వ్యాస.
విద్యావతార గురువులు: సరస్వతీ, వినాయక, శుక, సుమంతు, జైమిని, వైషంపాయన, నారద, పుండరీక, సుచేల
దీక్షాగురుక్రమము: మహాదేవ, మహాదేవి, పరమేష్ఠి, సమీరణ, వరుణ, వామదేవ, కశ్యప, అంగీరస, కృత

స్వగురుక్రమము: కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. ఆతర్వాత,
నృసింహ, వామన, సత్యా, బల, బాల, ధనుర్ధర, శంఖీ, చక్రీ, హలీ, ఖడ్గీ, ముసలి, రమణ, అజిత, పురుష, భూధర, విశ్వ, గోవింద, గోవివర్ధన, గోపీశ్వర, జీతక్రోధ, మీన, మీనకేతన, మనోహర, సాశ్వత, కేశవ, అచ్యుత, వామన, నరసింహ, అవ్యయ, విష్ణు, నారాయణ, మహీధర, చిదంశ, చిత్ర్పకాశ, మాధవ, మధుసూదన, పురుషోత్తమ, పద్మాక్ష, ఘనశ్యామ, ధరాధవ, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.

వీరిమంత్రము: క్లీం నృసింహ శ్రీ పాదేభ్యోనమః| ఈ విధంగా అందరికీ ఉంటుంది.

వీరి స్మరణ మాత్రముననే మంత్రము తక్షణం సిద్ధిస్తుంది.

శైవ మంత్రముల గురుక్రమము

శైవమంత్రముల విద్యా సిద్ధి కొరకు ఈ మంత్రముల గురుక్రమము తెలుసుకొని వారిని భజించాలి. అన్యధా ఫలము సిద్ధించదు.

కులగురువులు:
విశ్వేశ్వర, భగవాన్, మహాదేవ, త్ర్యంబక, త్రిపురాంత, కాలాగ్నిరుద్ర, కాల, సర్వేశ్వర, నీలకంఠ, దిక్పతి, సదాశివ.

విద్యావతార గురుక్రమము:
వీరభద్ర, గణాధ్యక్ష, శూలాయుధ, శివ, ఈశాన, ప్రమథాధిప, నంది, భృంగి, ప్రచండక, మహిష, మదనారతి. వీరి స్మరణము సిద్ధిదాయకము.

దివ్యౌఘ:
అఘోర, ఘోర, ఘోరఘోరతర, సర్వ, సర్వ, రుద్ర, తత్పురుష, మహాదేవ, విరూపాక్ష, సద్యోజాత, భవ. (గమనిక: సర్వ ఇద్దరు కలరు)

సిద్దౌఘ:
భావోద్భావ, వినాయక, చండీశ, వామదేవ, శంకర, విశ్వనాయక, జ్యేష్ఠ, శ్రేష్ఠ, కాల, భూతేష, ప్రమాధేశ్వర.

మావౌఘ:

కలవికరణ, బలవికరణ, బలప్రమధన, సర్వభూతాంతదమన, మనోన్మన, ఉగ్ర, భీమ, పశుపతి, నీలగ్రీవ, త్రిలోచన, విశ్వేశ్వర. విద్యాసిద్ధి కొరకు వీరిని పూజించాలి.

దీక్షాగురువులు

కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. ఆతర్వాత,
కామేశ, కాలకంఠ, కాలఘ్న, కాలరూపధృక, కామాంతక, విశాలాక్ష, వీరభద్ర, వినాయక, శూలాయుధ, గిరీశ, కైలాశ, వాఙ్మయ, హర, బుధేశ, అమరేశ, చండీశ్వర, కుమార, మహేశ్వర, మహాదేవ, విశ్వనాథ, ప్రజాపతి, ఆత్మేశ్వర, సంవర్తక, క్రమేశ, ప్రకాశన, లలిత, స్పర్శ, భూతేశ, ఆనంద, ప్రభేశ్వర, రాగేశ, కరాలేశ, సిద్ధేశ, సమయేశ్వర, జ్ఞానానంద, ప్రియానంద, కలానంద, అమృతేశ్వర, గుహ్యేశ్వర, చిదానంద, కులేశ, చండ, కౌలిక, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.
వీరందరూ సిద్ధి దాయకులు.
వీరి మంత్రము: హౌం________ ఆరాధ్యచరణేభ్యో నమః
వీరి నిత్య పూజ, స్మరణము వలన మంత్ర సిద్ధి కలుగుతుంది.

సౌరగురుక్రమము

దివ్యౌఘ: మిహిర, సుగుప్త, ప్రభేశ
సిద్దౌఘ: అరుణ, మరీచి, మయూఖ
మావౌఘ: కాత్యాయన, ఘృణీశ, మార్తాండ

మహౌజస చింతనీయ కులగురుక్రమము
దివ్యౌఘ: వేదాత్మ, భాస్కర, ప్రఘ్న
సిద్దౌఘ: భాస్వాన్ ప్రభాకర, నారాయణ, కపర్ది
మావౌఘ: బ్రహ్మ, విష్ణు, మహేశ, ఈశాన

విద్యావతారగురుక్రమము
ఆనంద, సమయ, విమల, జ్ఞానదీపిక, చిద్ఘన, సోమనాథ, సవిత, పోషణ, అరుణ, మహేశ, విజయ, భూతేశ, దేవభాగ.

దీక్షాగురువులు:
బుద్ధిమంతులు, ఈ దీక్షాగురువులను యత్నపూర్వకంగానైనా నవపంక్తి క్రమము నందు చెయ్యాలి.
కపిలుని నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. ఆతర్వాత,
జైమిని, సుమంతు, జ్ఞానవర్ధన, చిదానంద, చిదాభాస, చిన్మయ, యోగవిదగురు, సత్యవ్రత, చిద్రూప, భైరవ, అంబరనాయక, విశ్వేశ్వర, మిత్రకర, శుభంకర, దివాకర, గణేశ్వర, మార్తాండ, భైరవ, ద్యుమ్ని, రవి, త్రివిక్రమ, వాసుదేవ, శంకర, రవిలోచన, పుండరీక, రమేశ, గుణారామ, ధనేశ్వర, దేవేంద్ర, గోపనాథ, పురుష, మహాశయ, ఆచార్యసింహ, గోవింద, వేదజ్ఞ, మిత్రవింద, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య
వీరందరూ పూజనీయులు. వీరిస్మరణ మాత్రముననే సౌరమంత్రములు తక్షణం సిద్ధిస్తాయి.
వీరి మంత్రము: హ్రీం _______ పాదుకాభ్యోనమః|
ఇంకావుంది

కామెంట్‌లు లేవు: