సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, మార్చి 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 9


ఆమ్నాయగురుక్రమము:

ఉత్తరామ్నాయములో ఏ గురువులు సిద్ధిదాయకములు అని చెప్పబడ్డారో వారిలో మొదటి నుండి భైరవ వరకు ఆమ్నాయ గురుక్రమము.

పూర్వామ్నాయ దేవతలు:

భేదసహిత శీవిద్యా, బాల, త్రిపురా, భగమాల, నిత్యక్లిన్న, స్వయంవర, మధుమతి, ఉన్మనీ, భేడా, శారికా, సురసుందరి, అశ్వారూఢా, మహామాయ, కూరుకుళ్ళ, సురేశ్వరి, భువనేశ్వరి, అన్నపూర్ణ.

దక్షిణామ్నాయ దేవతలు:

బగల, వశినీభేద, త్వరిత, ఫలద, భేదసహిత వారాహి, భేదసహిత భోగిని, కామేశ్వరి, భేరుండా, వజ్రేశి, వహ్నివాసిని, శివదూతీ, విచిత్ర, విజయ, సర్వమంగళ, మహిషార్ది

పశ్చిమామ్నాయదేవతలు

మహాసరస్వతి, వాగ్వాదిని, నీలపతాక, భేదయుత భైరవి, చాముండ, రక్తచాముండ, బ్రాహ్మ్యాది దశదేవత, ప్రత్యఙ్గిర, భవాని.

ఉత్తరామ్నాయదేవతలు

భేదసహిత కాళీ, భేదసహిత తారా, మాతంగీ, భైరవి, ఛిన్నమస్త, ధూమావతి. వీరందరూ అల్పకాలంలో ఫలప్రదాన సమర్ధులు.

అధామ్నాయదేవతలు

నాగశక్త్యాది విద్యలు అధః ఆమ్నాయదేవతలు. ఈ దేవతల భేద జ్ఞానము కొరకు గురుక్రమమును పూజించాలి.

అసంప్రదాయపూజ - వాని ఫలము

భూమి మీద గురుమండలము నిర్మించి సంప్రదాయమును అనుసరించి పరమ భక్తితో గురుసంతతి పూజ చేసినచో సిద్ధికలుగుతుంది. సంప్రదాయమునందు దీక్షుతులు కానివారికి దేవతా ఫలము కలగదు. సంప్రదాయ విహీనుడైన మహాజ్ఞాని దగ్గర ఉపదేశం పొంది యత్నపూర్వకంగా అర్చన చేసినా, పురశ్చరణ విధివిధానంగా తర్పణము, హోమము చేసినా అవన్నీ నిశ్చయముగా అభిచార కర్మలవుతాయి.

[అనువాదకుని మాట (అ.మా.)
ఇంత కచ్చితంగా శాస్త్రవచనము ఉండగా, నేడు కొందరు కుహనా సాధకులు, సంప్రదాయము అవసరం లేదని, గురువు అసలు అక్కరలేదని ప్రచారము చేయుచూ శ్రీవిద్య మీద వ్యాపారము చేస్తున్నారు. చాలామంది వారి మాటలను విశ్వసించి సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తూ అంతర్జాలంలో మంత్రములను తెలుసుకొని శ్రీవిద్యోపాసకులుగా తమకు తాము ప్రచారం చేసుకోవడం కడు శోచనీయము.] 

యంత్ర-మంత్రోద్ద్వార పూర్వక యంత్రమందు సావరణ గురుపాదుకా అర్చన విధానము:

గురుమండల యంత్రమును ఈ క్రింది విధంగా నిర్మించాలి.
బిందు, త్ర్యస్య త్రికోణ, నవకోణ, అష్టదళ, త్రివృత్త, చతురస్రము.
ఈ అర్చన యంత్రమునకు ముందు గణేశ, భైరవ, వటుక, సిద్ధ, చరణ, శాంభవ, మాలినీ చక్రములను కూడా నిర్మించాలి. ఈ విధముగా గురుమండలము సప్తచక్రాత్మకము అవుతుంది.

గురుపూజన మంత్రము:

గురుమంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం హ్క్ఫ్రేం హ్సౌం హసక్షమలవరయూం శ్రీఅముకానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః|
యంత్ర మధ్యలో ఈ మంత్రంతో గురు అర్చన చెయ్యాలి.

గురుపత్ని మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం హ్క్ఫ్రేం సౌహ్హ్ సహక్షమలవరయీం శ్రీఅముకాదేవ్యాంబా శ్రీపాదుకాం పూజయామి నమః|
గురువుకు ఎడమ భాగమందు గురుపత్ని పూజ చెయ్యాలి.
ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: