సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, జూన్ 2020, శుక్రవారం

వారాహీ నవరాత్రులువారాహీ నవరాత్రులు


శ్రీవిద్యోపాసనలో శ్రీవారాహీ ఉపాసన చాలా ముఖ్యము. ఈమె శ్రీ లలితాపరమేశ్వరి సేనాపతి. అందుకే ఈమెను దండనాయకి అని అంటారు. ఈమె శ్రీచక్రరాజమునకు ఎడమవైపున కిరిచక్రమును అధిరోహించి ఉండును. ఈమె జ్ఞానప్రదాత. ఈమె మంత్రములోని బీజాక్షరములు జ్ఞానమునకు మరియు అజ్ఞానమును తొలగించి పరబ్రహ్మ అయిన శ్రీలలితాపరమేశ్వరిని చేరుటకు సూచనలు.
దండనాధయను వారాహీ మంత్రోపాసన వలన "విశుక్రుడు" అను అహంకారస్వరూపుడు, సంసారలంపటుడు నశించును. అనగా ఆయాభావనలు నశించును. ఆ భావనల నాశనమే జ్ఞానము. అందుకే ఈమె జ్ఞానప్రదాత. సంసారకూపమనే జలములో మునిగిపోయిన తన సాధకుడిని జ్ఞానమనే తన దంష్ట్రములతో రక్షించేదే శ్రీవారాహీ.
శ్రీచక్రములోని వసుకోణమే (ఏడవ ఆవరణ - సర్వరోగహరచక్రం) కిరిచక్రము. ఇది ఒక రహస్యము.

ఆషాఢశుక్ల ప్రతిపత్ నుండి నవమి వరకు శ్రీ వారాహీ నవరాత్రులు. 
(ఈ సంవత్సరము తే22.06.2020ది నుండి శ్రీవారాహీ నవరాత్రులు.)

ఈరోజుల్లో మరొక ముఖ్యమైన ఉత్సవము పూరీలోని శ్రీ జగన్నాథస్వామి
వారి రథోత్సవము. శరీరమనే రథమును నడిపించే జీవుడే జగన్నాథుడు.
ఈ అద్భుతమైన రోజుల్లో సాధకులు అమ్మవారిని, స్వామివారిని విశేషంగా పూజించి తరింతురుగాక.

1 కామెంట్‌:

Balu చెప్పారు...

Very intuitive information given by Sri Ravi, Good load of information digged down to a common man to understand